విశాఖలో ప్రీ ఫ్యాబ్ నిర్మాణ కేంద్రం ఏర్పాటు చేయాలని లోకేష్ అభ్యర్థన

రిపోర్టర్: వెంకట్ స్థలం: అహ్మదాబాద్

విశాఖపట్నంలో డేటా సెంటర్ల కోసం ప్రీ ఫ్యాబ్ నిర్మాణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఈప్యాక్ గ్రూప్ చైర్మన్ భజరంగ్ బోత్రాతో జరిగిన భేటీలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కోరారని అధికారులు తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని భజరంగ్ బోత్రా స్పష్టం చేశారు. ఇప్పటికే శ్రీసిటీలో తమ సంస్థ తయారీ యూనిట్లను నిర్వహిస్తోందని, మాంబట్టు ఫేజ్ II కేంద్రం వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించిందని ఆయన వెల్లడించారు.