ఆరోగ్య భవిష్యత్తుకై ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకోవాలి
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
సమతుల్యమైన ఆహారం తీసుకుంటే అది ఔషధంలా పనిచేస్తుందని జన్నారం సెక్టార్ ఐసీడీఎస్ సూపర్వైజర్ పొన్నం వాణి అన్నారు. మండలంలోని జన్నారం అంగన్వాడీ-2 కేంద్రంలో శుక్రవారం పోషణ మాసం వేడుకలు నిర్వహించారు. మానవ జీవితంలో తొలి వెయ్యి రోజులు అత్యంత కీలకమని, గర్భధారణ నుంచి పిల్లలకు రెండేళ్లు వచ్చే వరకు తగిన పోషకాహారం అందించాలని ఆమె సూచించారు.