తాను పిలుపునిస్తే అసలు ఎన్నికలే జరగవంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ వార్నింగ్
రిపోర్టర్: సురేష్
స్థలం: కడప
తాను పిలుపునిస్తే అసలు ఎన్నికలే జరగవని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. పులివెందులలో జరుగుతున్న ఎన్నికల్ లో పోలింగ్ కేంద్రాల్లోకి వైసీపీ ఏజెంట్లను అనుమతించలేదంటూ ఆయన ఆర్వో అధికారులకు ఫిర్యాదు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద జరుగుతున్న హింసపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, టీడీపీ నేతల అరాచకాలపై అధికారులు రిపోర్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు జరగనివ్వాలా లేక ఆపాలా అనేది మనసాక్షితో ఆలోచించాలని హెచ్చరించారు.