విజయవాడ రైల్వే స్టేషన్‌లో వందేభారత్ రైలులో మంటలు చెలరేగి కలకలం
రిపోర్టర్: కిరణ్
స్థలం: విజయవాడ
విజయవాడ రైల్వే స్టేషన్‌లో నరసాపురం నుంచి చెన్నై వెళ్తున్న వందేభారత్ రైలు సీ4 కోచ్‌లో వీల్ యాక్సిల్ వద్ద లోపం తలెత్తి స్వల్పంగా మంటలు, భారీగా పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించి పెనుప్రమాదం తప్పించారు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ లేదా చక్రం రాపిడి కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తుండగా, ప్రయాణికులను మరో ఏసీ రైలులో గమ్యస్థానాలకు తరలించారు.