ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: New Delhi

సత్య నికేతన్ భవన కూలుడు ఘటనపై బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. బాధ్యులపై చర్యలు తీసుకోకుండా ప్రధాని మోడీ ప్రశ్నించే వారిని అప్రతిష్టపాలు చేసేందుకు అవమానకరమైన పదాలు వాడుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉన్నా నిర్లక్ష్య వైఖరి వీడటం లేదని, దీనివల్ల ప్రజల ప్రాణాలు గాలికీ కలుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.