బియ్యం ధరల భారీ పెరుగుదలపై రాజకీయ విశ్లేషకులు సుమంత్ రామన్ ప్రశ్న
రిపోర్టర్: రమేష్
స్థలం: Andhra Pradesh / Telangana
దేశంలో ఇతర నిత్యవసర వస్తువులతో పోలిస్తే బియ్యం ధరలు ఊహించని విధంగా భారీగా పెరిగిపోవడంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ సుమంత్ రామన్ ఆందోళన వ్యక్తం చేశారు. బియ్యం ధరల్లో ఈ స్థాయిలో ధరల పెరుగుదల నమోదు కావడానికి గల అసలు కారణాలు ఏమిటంటూ ఆయన బహిరంగంగానే నిలదీశారు. సామాన్యులపై తీవ్ర భారం మోపుతున్న ఈ పరిణామం వెనుక ఉన్న అసలు కారణాలపై తక్షణమే స్పష్టత ఇవ్వాలని విశ్లేషకులు డిమాండ్ చేస్తున్నారు.