స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలు సమర్థనీయం: ఏపీ ప్రభుత్వం

రిపోర్టర్: విజయ్ స్థలం: ఆంధ్రప్రదేశ్

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. డెడికేటెడ్ కమిషన్ అధ్యయనం, సమగ్ర కుటుంబ సర్వే గణాంకాల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. రిజర్వేషన్లను యాంత్రికంగా నిర్ణయించలేదని, బీసీలకు అర్థవంతమైన ప్రాతినిధ్యం కల్పించడమే తమ లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. 2020 నాటి పరిస్థితులకు, ఇప్పటికీ ఎంతో వ్యత్యాసం ఉందని ప్రభుత్వం వివరణ ఇచ్చింది.