సీఈసీ రాజీనామా కోరుతూ రాంలీలా మైదానంలో ఇండియా కూటమి చలో ఢిల్లీ
రిపోర్టర్: రాజేష్
స్థలం: న్యూఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు ఇండియా కూటమి నేతలు వెల్లడించారు. ఓటు చోరీ ఆరోపణలతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ మహా ప్రదర్శనకు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లాయి.