సమస్యల పరిష్కారానికి మోత్కూర్ విద్యుత్ కార్యాలయంలో పోటెత్తిన వినియోగదారులు

రిపోర్టర్: Srinivasulu akavaram స్థలం: మోత్కూర్

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ సబ్ డివిజన్ కార్యాలయంలో మంగళవారం విద్యుత్ వినియోగదారుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆత్మకూరు, అడ్డగూడూరు, మోత్కూర్, గుండాల మండలాల నుంచి మొత్తం పన్నెండు దరఖాస్తులు అందాయని ఏఈ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ల మార్పు, లూజ్ వైర్ల తొలగింపు తదితర సమస్యలపై వినియోగదారులు వినతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏడీ బాలు నాయక్ తో పాటు పలువురు విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.