ఖమ్మం జిల్లా నూతన విద్యాశాఖాధికారిగా డి. వాసంతి నియామకం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారిగా డి. వాసంతిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఈఓగా సేవలందిస్తున్న ఆమెను ఖమ్మం జిల్లాకు బదిలీ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ తాజా ఆదేశాల మేరకు డి. వాసంతి త్వరలోనే ఖమ్మం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో నూతన అధికారిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నియామకం పట్ల పలువురు ఉపాధ్యాయ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.