టెట్ లేకుండా క్రీడా కోటా ఉద్యోగం: విద్యాశాఖ కీలక విచారణ

రిపోర్టర్: సునీల్ స్థలం: కర్నూలు

కర్నూలు జిల్లాలో టెట్ అర్హత లేకుండానే క్రీడా కోటాలో ఎస్జీటీగా ఈడిగ ప్రభాకర్ నియామకంపై పాఠశాల విద్యాశాఖ సీరియస్ అయ్యింది. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ నియామకంపై విచారణ ప్రారంభించినట్లు డైరెక్టర్ ప్రకటించారు. డీఈఓ ద్వారా రికార్డులను పరిశీలిస్తున్నామని, నివేదిక రాగానే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ అక్రమ నియామకంపై విద్యాశాఖ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.