స్థానిక పోరులో జోరుగా సాగుతున్న బొత్స పూజిత ఎన్నికల ప్రచారం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి బొత్స పూజిత పాల్గొని ఓటర్లను కలిసి మద్దతు కోరారు. చుక్కవలస మరియు బీజె పాలెం గ్రామాలలో ఆమెతో పాటు డాక్టర్ బొత్స సందీప్ ఉత్సాహంగా పర్యటించారు. స్థానిక ప్రజలు ఆమెకు మంగళహారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రచారాన్ని విజయవంతం చేశారు.