వైద్య వృత్తికి కళంకం తెచ్చేలా రోగి ప్రైవసీని గాలికి వదిలేసిన కోల్కతా ఇంటర్న్
రిపోర్టర్: రమేష్
స్థలం: కోల్కతా
కోల్కతాకు చెందిన ఓ మహిళా వైద్య విద్యార్థిని ప్రసవ సమయంలో వైద్య ప్రక్రియకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తీవ్ర దుమారం రేపింది. రోగి గోప్యతను, వృత్తి ధర్మాన్ని విస్మరించి ఇలా ఫొటోలు షేర్ చేయడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ పుట్టిన శిశువు ఫొటో పోస్ట్ చేసి వివాదంలో చిక్కుకున్న ఈ ఇంటర్న్, తాజాగా మరో వివాదాస్పద పోస్ట్ పెట్టిందని సోషల్ మీడియా వినియోగదారులు మండిపడుతున్నారు. దీనిపై వైద్య వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.