పోలీస్ శిక్షణ కేంద్రంలో నూతన కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం.. ఎస్పీ అజిత వేజెండ్ల
రిపోర్టర్: sujith reddy
స్థలం: వెంకటాచలం
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంట పంచాయతీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో 35 కంప్యూటర్లతో నూతనంగా ఏర్పాటు చేసిన ల్యాబ్‌ను జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల ప్రారంభించారు. శిక్షణ పొందుతున్న 176 మంది ఎస్సీటీ పీసీలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు ఈ ల్యాబ్ దోహదపడుతుందని ఆమె తెలిపారు.
పోలీసు విధుల్లో డిజిటల్ టెక్నాలజీ వినియోగం అత్యంత కీలకమని ఎస్పీ పేర్కొన్నారు. ఈ ల్యాబ్ ద్వారా సైబర్ నేరాలు, డేటా నిర్వహణ, ఆన్లైన్ సేవలు తదితర అంశాల్లో మెరుగైన శిక్షణ పొందవచ్చని, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించవచ్చని ఆమె సూచించారు.