చిరువ్యాపారుల జీవనోపాధిని దెబ్బతీయొద్దని అధికారులను కోరిన తల్లోజు ఆచారి

రిపోర్టర్: Mohammad Abdul Azeem స్థలం: ఆమనగల్లు

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు ప్రభుత్వాసుపత్రి ముందు 40 ఏళ్లుగా చిరువ్యాపారాలు చేసుకుంటున్న వారిని ముందస్తు సమాచారం లేకుండా మున్సిపల్ సిబ్బంది తొలగించడంపై జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల జీవనోపాధిని దెబ్బతీయకుండా, వారికి ప్రత్యామ్నాయ స్థలం చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా విద్యుత్ సరఫరా నిలిపివేయడం సరికాదని, పేదల బతుకులతో చెలగాటం ఆడవద్దని అధికారులను ఆయన హెచ్చరించారు.