అమెరికాలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదినోత్సవం మరియు తెలంగాణ విమోచన వేడుకలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: న్యూజెర్సీ
అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం ఎడిసన్ నగరంలో ఓవర్సీస్ బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినోత్సవం, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా రెడ్డి అనుగుల, విలాస్ రెడ్డి జంబుల, అమర్ గోస్వామి, అనిత చద్దా తదితరులు పాల్గొని ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ విమోచన పోరాట త్యాగాలను స్మరించుకుంటూ, దేశాభివృద్ధిలో ప్రవాస భారతీయుల పాత్రను వక్తలు కొనియాడారు.