బాలరేవుల–కునుకూరు బీటీ రోడ్డు ప్రారంభం: గిరిజనులకు సులభతరమైన రవాణా వసతి

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: కొయ్యూరు

కొయ్యూరు మండలంలో రూ.3.3 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును చైర్మన్ సుమర్ల సాంబశివ ప్రారంభించారు. రహదారి అందుబాటులోకి రావడంతో ఆయా గ్రామాల గిరిజనులకు రవాణా కష్టాలు తొలగి రాకపోకలు అత్యంత సులభతరం కానున్నాయి.