ఐఐటీ విద్యార్థుల అనైతిక పరీక్షా సరళిపై ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త హెచ్ సీ వర్మ ఆందోళన

రిపోర్టర్: సురేష్ స్థలం: New Delhi

ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య ఘటన నేపథ్యంలో విద్యారంగంలో నెలకొన్న అనైతిక పరీక్షా సరళి, డమ్మీ పాఠశాలల సంస్కృతిపై ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త హెచ్ సీ వర్మ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షల్లో కాపీయింగ్, ల్యాబ్ క్లాసులకు వెళ్లకుండానే ప్రాక్టికల్ మార్కులు వేయడం వంటి అనైతిక పద్ధతులు విద్యార్థులను నైతికంగా దిగజార్చుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కోచింగ్ సంస్కృతి, తల్లిదండ్రుల ఒత్తిడి కారణంగా విద్యార్థుల జీవన శైలి మారి శారీరకంగా, మానసికంగా బలహీనపడుతున్నారని హెచ్చరించారు.