అనంతపురం ఉన్మాది హేమంత్ కు తీవ్ర గాయం: కాలు తొలగించే అవకాశం
రిపోర్టర్: వెంకట్
స్థలం: అనంతపురం
అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి విద్యార్థినిపై దాడి చేసిన నిందితుడు హేమంత్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్ మల్లీశ్వరి తెలిపారు. పోలీసుల కాల్పుల్ లో గాయపడిన హేమంత్ కుడి కాలుకు రక్తప్రసరణ నిలిచిపోవడంతో కుళ్లిపోయిందని పేర్కొన్నారు. ప్రాణాపాయం తప్పించేందుకు ఆ కాలును సగభాగం తొలగించే పరిస్థితి వచ్చిందని సోమవారం ఆమె వెల్లడించారు. వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తోందని స్పష్టం చేశారు.