గుండెపోటుతో నెల్లూరు సీఐడీ ఎస్సై చేవూరి ప్రభాకరరావు మృతి
రిపోర్టర్: రమేష్
స్థలం: సింగరాయకొండ
నెల్లూరు సీఐడీ విభాగంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న చేవూరి ప్రభాకరరావు గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి ఆయన రోజూ విధులకు వెళ్లేవారు. శనివారం విధులు ముగించుకుని రైలులో ఒంగోలుకు రాగా, ఛాతిలో తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయన స్వగ్రామమైన సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి పరిధిలోని టీపీనగర్లో పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.