బీఆర్ఎస్ ఎమ్మెల్యేలది ముందస్తు ప్రణాళికా నాటకం: కాటిపల్లి నగేశ్ రెడ్డి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: కామారెడ్డి
కాంగ్రెస్ అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాటకాలు ఆడుతున్నారని డీసీసీ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కేటీఆర్, హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలు ప్రణాళిక ప్రకారమే అసెంబ్లీ వద్ద హంగామా సృష్టించారని ఆరోపించారు. స్పీకర్‌పై విజ్ఞత లేకుండా మాట్లాడడం సిగ్గుచేటని, హుందాగా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు.