రైతులు దళారులను నమ్మి మోసపోవద్దంటూ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ పిలుపు

రిపోర్టర్: శివ స్థలం: బీర్కూర్

రైతులు దళారులకు ధాన్యం విక్రయించి మోసపోవద్దని ఏఎంసీ ఛైర్ పర్సన్ శ్యామల, సొసైటీ పీఐసీ పర్సన్ ఇన్ఛార్జిలు కమలాకర్ రెడ్డి, గాంధీ స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని పలు గ్రామాల్లో గురువారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించారు. ఏ గ్రేడ్ ధాన్యం ధర రూ. 2461, బీ గ్రేడ్ ధర రూ. 2441 చొప్పున కనీస మద్దతు ధర అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు సర్పంచులు, సొసైటీ కార్యదర్శులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.