భద్రాచలం గోదావరి వద్ద తెగిన కేబుల్ బోల్తా పడిన క్రేన్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: భద్రాచలం

భద్రాచలం వద్ద గోదావరి నది తీరంలో శుక్రవారం రాత్రి గణేష్ నిమజ్జన వేడుకల్లో అనూహ్య ప్రమాదం చోటుచేసుకుంది. భారీ విగ్రహాన్ని నదిలోకి దింపుతున్న సమయంలో క్రేన్ కేబుల్ తీగలు తెగిపోవడంతో సింగరేణికి చెందిన భారీ క్రేన్ బోల్తా పడిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో విగ్రహం విరిగిపోయిందని, డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రాణాపాయం తప్పిందని భక్తులు వెల్లడించారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి నిమజ్జనాలను తిరిగి పునరుద్ధరించారని అధికారులు పేర్కొన్నారు.