గుస్సాడీ నృత్యాల హోరుతో దద్దరిల్లిన జన్నారం కొలాం గూడ
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని కొత్తపేట కొలాం గూడలో దీపావళి వేడుకలు ముందుగానే ప్రారంభమయ్యాయి. వారం రోజుల ముందే ప్రారంభమైన గుస్సాడీ నృత్యాలతో గూడలో పండుగ వాతావరణం నెలకొంది. సాంప్రదాయ గిరిజన వేషాధారణ, డప్పుల దరువులకు అనుగుణంగా కళాకారులు ప్రదర్శిస్తున్న నృత్యాలు స్థానికులను, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.