స్వచ్ఛ రథం ద్వారా పొడి చెత్త సేకరణపై కొత్త ఆఫర్లు ప్రకటించిన ఎంపీడీవో

రిపోర్టర్: పి రాజేష్ కుమార్ స్థలం: గంగాధర నెల్లూరు

గంగాధరనెల్లూరు మండలంలో పరిసరాల పరిశుభ్రతను మెరుగుపరచడం లక్ష్యంగా ఎంపీడీవో మనోహర్ గౌడ్ ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు. స్వచ్ఛ రథం వాహనానికి పొడి చెత్త అందించే కుటుంబాలకు కిలోకు అదనంగా నాలుగు రూపాయలు ప్రోత్సాహకం అందజేస్తామని తెలిపారు. అలాగే పది కేజీలకు పైగా చెత్త ఇస్తే ఉచితంగా లక్కీ డిప్ టోకెన్లు ఇస్తామని పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భంగా విజేతలకు రైస్ కుక్కర్ డిన్నర్ సెట్ బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు.