విద్యార్థులకు గుడ్ న్యూస్: ఐఐఎస్ఈఆర్ తిరుపతితో మెల్బోర్న్ వర్సిటీ సరికొత్త ఒప్పందం

రిపోర్టర్: వెంకట్ స్థలం: తిరుపతి

మెల్బోర్న్ విశ్వవిద్యాలయం మరియు ఐఐఎస్ఈఆర్ తిరుపతి సంయుక్తంగా సైన్స్ రంగంలో సరికొత్త రెండు ప్లస్ రెండు డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ను ప్రారంభించినట్లు ప్రొఫెసర్ ఫ్రాంక్ వెటెరే వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక విద్యా భాగస్వామ్యం ద్వారా భారతీయ విద్యార్థులు రెండు సంవత్సరాలు తిరుపతిలో, మరో రెండు సంవత్సరాలు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వర్సిటీలో చదువుకోవడానికి అవకాశం లభిస్తుంది. దీనివల్ల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి పరిశోధన అనుభవంతో పాటు రెండు వేర్వేరు సంస్థల నుంచి డిగ్రీలు అందుతాయని ఆయన స్పష్టం చేశారు.