దేశవ్యాప్తంగా ఘనంగా జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం
రిపోర్టర్: రాము
స్థలం: India
అడవులు, వన్యప్రాణుల పరిరక్షణ కోసం ప్రాణాలర్పించిన అటవీ యోధులను స్మరించుకుంటూ సెప్టెంబర్ 11న జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1730లో రాజస్థాన్లోని ఖేజర్లీలో చెట్ల రక్షణ కోసం అమృతాదేవి నేతృత్వంలో 363 మంది బిష్ణోయీలు ప్రాణత్యాగం చేశారు. ఈ చారిత్రక త్యాగాల స్ఫూర్తితో పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను చాటిచెప్పేలా దేశవ్యాప్తంగా ఈ వేడుకలను జరుపుకుంటున్నారు.