అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో మురిసిన పెద్దకొండూరు గ్రామసీమ

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పెద్దకొండూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గుండెబోయిన శిరీష ఇస్తారి యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా రజాకారుల నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రాంతం 1948 సెప్టెంబరు 17న విముక్తి పొందిందని ఆమె గుర్తుచేశారు. అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.