విజయవాడలో ఉమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ బైక్ ర్యాలీ ప్రారంభం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: విజయవాడ

ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న ఉమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌పై అవగాహన కల్పించేందుకు విజయవాడలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ముఖ్య అతిథిగా హాజరై ఈ ర్యాలీని ప్రారంభించారు. నోవోటెల్ సమీపం నుంచి మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వరకు సాగిన ఈ ర్యాలీలో వంద మందికి పైగా మహిళా బైకర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ నెల 19 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది.