ఎర్రవెల్లి భూముల వివాదంపై బట్టబయలైన రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలు
రిపోర్టర్: నరేష్
స్థలం: ఎర్రవెల్లి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలు బట్టబయలయ్యాయని, ఎర్రవెల్లిలో సర్వే చేస్తున్న భూముల్లో కేసీఆర్ పేరు ఎక్కడా లేదని ఆరోపణలు వస్తున్నాయి. సర్వే నంబర్ 325లోని భూమి 250 మంది దళితుల పేరిట ఉందని, ఎమ్మార్వో, ఆర్డీవో, అడిషనల్ కలెక్టర్లు 22A జాబితాలో సంతకాలు చేశారని స్పష్టమవుతోంది. ఈ వాస్తవాలు తెలిసినప్పటికీ కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.