తిరుమలలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న శ్రీవారి మహా రథోత్సవం
రిపోర్టర్: మహేష్
స్థలం: తిరుమల
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం శ్రీవారి మహా రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. గోవింద నామస్మరణ మధ్య ఉభయదేవేరులతో కూడిన మలయప్పస్వామి మహారథంపై తిరుమాడ వీధుల్లో విహరించగా, వేలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగి స్వామివారిని దర్శించుకున్నారు. రథంపై విహరించే శ్రీవిష్ణువును దర్శించుకుంటే పునర్జన్మ ఉండదన్నది పురాణోక్తి కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు.