బ్లాక్ మార్కెట్ దందాలపై ఉక్కుపాదం మోపాలని నేతల గర్జన
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని మొహమ్మద్ సలాం డిమాండ్ చేశారు. లెనిన్ నగర్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, ధరల పెరుగుదలతో సామాన్యులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టి, అన్ని గోదాములపై నిఘా పెట్టాలని కోరారు. సమావేశంలో యనాలి సాంబశివారెడ్డి, జ్వల నర్సింహారావు, ఎండీ రెహమాన్, డి.శేఖర్ తదితరులు పాల్గొన్నారు.