సత్యసాయి బాబా శతాబ్ది ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి అన్సరుల ఆహ్వానం
రిపోర్టర్: గోపి
స్థలం: Hyderabad
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల ఇరవై మూడవ తేదీన నిర్వహిస్తున్న శతాబ్ది ఉత్సవాల్ లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డిని శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ మేరకు ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె. రత్నాకర్ స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేసినట్లు తెలంగాణ సీఎంఓ కార్యాలయం వెల్లడించింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కూడా పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు.