పార్లమెంట్ చర్చల వేదికంటూ రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్

రిపోర్టర్: సతీష్ స్థలం: New Delhi

పార్లమెంట్ అనేది చర్చల వేదిక గానీ సోషల్ మీడియా కాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్న సమయంలో రాహుల్ గాంధీ విదేశాలకు పారిపోతారని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఎస్ఐఆర్ మరియు ఈవీఎంలపై ప్రత్యేక చర్చకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే సవాల్ విసిరారని, ముందుగా దానికి సిద్ధం కావాలని ఆయన డిమాండ్ చేశారు.