శాంతా శ్రీరామ్ భూ వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హైకోర్టు తీర్పును సకాలంలో సవాలు చేయలేదంటూ ప్రభుత్వ పిటిషన్‌ను జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం కొట్టివేసింది. సికింద్రాబాద్‌లోని 40 ఎకరాల వివాదాస్పద భూమి ప్రైవేటుదేనని, అది శాంతా శ్రీరామ్ సంస్థకే చెందుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.