జగన్ సీఎం లక్ష్యంగా మనుబోలులో వైయస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం
రిపోర్టర్: sankar p
స్థలం: మనుబోలు
నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని పద్మావతి కళ్యాణ మండపంలో బొమ్మిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ వైయస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత హాజరయ్యారు. ప్రజా రంజక పాలన మళ్లీ సాగాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవడమే మన అందరి లక్ష్యంగా ముందుకు సాగాలని కార్యకర్తలకు నేతలు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో నియోజకవర్గ స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.