కేరళలో వినూత్న బోధన: ఇసుకపై అక్షరాలు దిద్దుతున్న ఎనభై ఐదేళ్ల అవ్వ

రిపోర్టర్: రాజేష్ స్థలం: Kerala

కేరళకు చెందిన ఎనభై ఐదేళ్ల ఇందిరా అమ్మ ఇసుకపై కర్రతో అక్షరాలు దిద్దే సంప్రదాయ పద్ధతిలో చిన్నారులకు విద్యను బోధిస్తున్నట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. ఎలాంటి పుస్తకాలు, పెన్సిళ్లు లేకుండానే దాదాపు దశాబ్ద కాలంగా ఆమె పిల్లలకు మలయాళం, హిందీ, ఇంగ్లీష్, గణితం నేర్పుతున్నారు. చిన్నారులు ఆమెను ఆప్యాయంగా ఆశాట్టి అమ్ముమ్మ అని పిలుస్తారు. చిన్న పిల్లలు ఇసుకపై సులభంగా తప్పులు సరిదిద్దుకుంటూ అక్షరాలు నేర్చుకునే ఈ వినూత్న బోధనా విధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది.