భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రమాదంలో ఉందన్న రాహుల్ గాంధీ
రిపోర్టర్: హరి
స్థలం: New Delhi
భారత ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు పునాది వంటిదని, రాజ్యాంగం, చట్టాలు, ప్రభుత్వ సంస్థల అధికారాలు అన్నీ దీనిపైనే ఆధారపడి ఉంటాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అయితే దేశంలో ప్రస్తుతం ఈ గొలుసుకట్టు వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని, భారత చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.