సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఆనంద్ దేవరకొండ 'ఎపిక్'

రిపోర్టర్: కృష్ణ స్థలం: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ చిత్రం 'ఎపిక్'. కంటెంట్‌పై నమ్మకంతో మేకర్స్ సెప్టెంబర్ 10న తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రీమియర్ షోలను ప్లాన్ చేశారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.