ఘోర ప్రమాదం తప్పుకుంది: ఏనుగుల ప్రాణాలు కాపాడిన అటవీ సిబ్బంది
రిపోర్టర్: రాజేష్
స్థలం: West Bengal
పశ్చిమ బెంగాల్లోని కుర్సియోంగ్ డివిజన్లో ఏనుగుల ప్రాణాలను కాపాడిన అటవీ శాఖ సిబ్బంది ఆకాష్ కెర్కెట్టా చర్యను ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ కొనియాడారని అధికారులు తెలిపారు. బాగ్డోగ్రా మార్గంలో వస్తున్న సిక్కిం మహానంద రైలు కింద పడకుండా ఏనుగుల గుంపును ఆయన అప్రమత్తం చేశారని చెప్పారు. సకాలంలో స్పందించి రైలును నిలిపివేయడంతో పెను ముప్పు తప్పిందని, ఈ సాహసోపేత చర్యపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారని వెల్లడించారు.