రష్మిక మందన్నాకు మద్దతు: భాషా ఆధిక్యతను ఖండించిన జావెద్ అక్తర్
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
నటి రష్మిక మందన్నా హిందీ ఉచ్ఛారణపై వస్తున్న విమర్శలను బాలీవుడ్ ప్రముఖ స్క్రీన్ రైటర్ జావెద్ అక్తర్ తీవ్రంగా ఖండించారు. రష్మిక మాతృభాష హిందీ కానప్పటికీ స్వయంగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆమెను అందరూ అభినందించాలని ఆయన ఎక్స్ వేదికగా కోరారు. అయితే ఆమెను తమిళ అమ్మాయిగా పేర్కొనడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుండగా, ఆమె కన్నడ అమ్మాయి అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.