సంగంలో సైకిల్ గుర్తుకు మద్దతుగా పోటెత్తిన కూటమి శ్రేణులు

రిపోర్టర్: saikumar స్థలం: సంగం

సంగంలోని బిట్ మూడు పరిధిలో ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సంగం సొసైటీ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్ తన సతీమణి మరియు బిట్ మూడు ఎంపీటీసీ అభ్యర్థి గుండ్లపల్లి మమతతో పాటు జెడ్పీటీసీ అభ్యర్థి కర్నాటి రవీంద్రారెడ్డి తరఫున ఇంటింటి ప్రచారం చేపట్టారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆశీస్సులతో బరిలో నిలిచిన తమ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు.