'స్నేహితురాలి కోసం బయోనిక్ చెయ్యి రూపొందించా': యువ ఇన్నోవేటర్ అన్ష్ మిశ్రా

రిపోర్టర్: భాస్కర్ స్థలం: ఉత్తర ప్రదేశ్

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన 18 ఏళ్ల ఇన్నోవేటర్ అన్ష్ మిశ్రా తన చిన్ననాటి స్నేహితురాలు షాహీన్ కోసం అసాధారణమైన బయోనిక్ ప్రొస్తెటిక్ చేతిని అభివృద్ధి చేశాడు. చిన్నతనంలో ప్రమాదవశాత్తు చెయ్యి కోల్పోయిన షాహీన్ గత 15 ఏళ్లుగా కృత్రిమ చెయ్యి లేకుండా ఇబ్బంది పడుతుండటాన్ని గమనించిన అన్ష్, ఎలక్ట్రానిక్స్ మరియు రోబోటిక్స్ రంగాలపై పట్టు సాధించి కేవలం స్క్రాప్ భాగాలు, 3డీ ప్రింటెడ్ పరికరాలతో 'బీఆర్‌హెచ్ఎం' పేరుతో తక్కువ ఖర్చుతో కూడిన సరికొత్త బయోనిక్ హ్యాండ్‌ను తయారు చేసి అద్భుతం సృష్టించాడు.