ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతుగా నిలిచిన వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా
రిపోర్టర్: వెంకట్
స్థలం: World
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్‌కు తగిన వైద్యం, గౌరవం కల్పించాలని వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా డిమాండ్ చేశారు. 'ఇది రాజకీయాలు కాదు, మానవత్వం' అని ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు దేశానికి స్ఫూర్తిగా నిలిచిన క్రీడాకారుడికి కనీస గౌరవం దక్కకపోవడం బాధాకరమన్నారు. సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ సహా పలువురు అంతర్జాతీయ కెప్టెన్లు ఇప్పటికే ఇమ్రాన్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ మద్దతు తెలుపుతున్నారు.