సీఎం రాచపల్లి ఎంపీటీసీ పోరులో వైఎస్సార్సీపీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్న నేతలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: చిట్వేల్
చిట్వేల్ మండలంలోని సీఎం రాచపల్లిలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా శ్రీకుల బాలాజీ ఎన్నికల బరిలో నిలిచారు. పార్టీ సీనియర్ నేత కొండూరు త్రివిక్రమ్ రాజు వ్యూహాత్మక మార్గదర్శకత్వంలో అభ్యర్థి విజయం కోసం ప్రచారం ముమ్మరం చేశారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.