ఓటీటీలో మనోజ్ బాజ్పాయ్ లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్: నవంబర్ 6న విడుదల
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
ప్రఖ్యాత నటులు మనోజ్ బాజ్పాయ్, బోమన్ ఇరానీ ప్రధాన పాత్రల్ లో నటించిన భావోద్వేగ భరిత చిత్రం 'లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్' నవంబర్ 6 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో స్ట్రీమింగ్ కానుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ప్రముఖ రచయిత అరవింద్ అడిగా నవల ఆధారంగా బెన్ రేఖి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాత రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.