హైదరాబాద్ లో మ్యాక్స్ ఫ్యాషన్ తొలి న్యూ ఐడెంటిటీ ఫ్లాగ్‌షిప్ స్టోర్ ప్రారంభం

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

ప్రముఖ దుస్తుల బ్రాండ్ మ్యాక్స్ ఫ్యాషన్ తన భారత ప్రస్థానంలో 20 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, దేశంలోనే మొట్టమొదటి న్యూ ఐడెంటిటీ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నెక్సస్ మాల్‌లో సినీ నటి మృణాల్ ఠాకూర్, సీఈఓ సుమిత్ చంద్నా ఘనంగా ప్రారంభించారు. 13,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌లో కల్కి కోచ్లిన్ క్యూరేట్ చేసిన ఫెస్టివ్ కలెక్షన్‌ను ఆవిష్కరించారు.