ముంబై ఫిల్మ్ సిటీలో అగ్ని ప్రమాదం: బాలీవుడ్లో ఒక్కసారిగా కలకలం

రిపోర్టర్: విజయ్ స్థలం: ముంబై

ముంబై ఫిల్మ్ సిటీలోని ప్రైమ్ ఫోకస్ స్టూడియో వెనుక భాగంలో సోమవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నట్లు ఫెడరేషన్ అధ్యక్షుడు బి.ఎన్. తివారీ తెలిపారు. రణ్బీర్ కపూర్, సాయి పల్లవి నటిస్తున్న రామాయణ షూటింగ్ ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు ప్రచారం జరిగిందని, అయితే మెయిన్ సెట్కు ఎలాంటి ప్రమాదం జరగలేదని మేకర్స్ స్పష్టం చేశారని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.