తపోవన ఆశ్రమ వృద్ధుల కోసం నిత్యావసరాలు అందించిన దాతలు

రిపోర్టర్: k. siva prasad స్థలం: చిట్వేల్

తిరుపతి జిల్లా చిట్వేల్ మండలంలోని శ్రీశ్రీశ్రీ దస్తగిరి నారాయణ తపోవన భయాంజనేయ స్వామి ఆశ్రమంలో వృద్ధుల భోజన సౌకర్యం కోసం దాతలు ఐదు వేల రూపాయల విలువైన నిత్యావసర సరుకులను అందజేశారు. కీర్తిశేషులు పగడాల సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఈ సాయం అందించారు. కార్యక్రమంలో ఆశ్రమ పీఠాధిపతి నాగేశ్వరమ్మతో పాటు కార్యకర్తలు, ఆశ్రమ పెద్దలు పాల్గొన్నారు.