ఏలూరు జిల్లాలో గొర్రెల కాపరుల సమస్యలను స్వయంగా తెలుసుకున్న మంత్రి పార్థసారథి

రిపోర్టర్: సతీష్ స్థలం: ఏలూరు

ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలో పర్యటనకు వెళ్తున్న సమయంలో రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మార్గమధ్యంలో తన వాహనాన్ని నిలిపివేశారు. ఆ సమయంలో గొర్రెలను మేపుకుంటూ వెళ్తున్న ముగ్గురు మహిళా కాపరులను గమనించి వారి వద్దకు వెళ్లి ఆప్యాయంగా మాట్లాడారు. వారి జీవనోపాధికి సంబంధించిన సమస్యలను అడిగి తెలుసుకుంటూ తగిన ప్రభుత్వ సహాయం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు.